కొవిడ్ టైమ్‌లో రెండో బిడ్డను కోల్పోయిన హీరోయిన్.. ఆ ఘటన గురించి చెప్తే కన్నీరు రాక తప్పదు..

by Prasanna |   ( Updated:2023-08-11 09:29:25.0  )
కొవిడ్ టైమ్‌లో రెండో బిడ్డను కోల్పోయిన హీరోయిన్.. ఆ ఘటన గురించి చెప్తే కన్నీరు రాక తప్పదు..
X

దిశ, సినిమా : ఒకప్పుడు బాలీవుడ్ గ్లామర్ డాల్‌గా రాణించిన హీరోయిన్ రాణీ ముఖర్జీ.. ఆ తర్వాత ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రాను వివాహం చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఒక బిడ్డకు తల్లిగా ఉన్న ఆమె.. కొవిడ్ టైమ్‌లో ఐదు నెలల గర్భాన్ని కోల్పోవడం గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో ఇందుకు సంబంధించిన విషాదం గురించి బయటపెట్టింది. ఈ ఘటన జరిగిన 10 రోజులకే ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ సినిమా గురించి ఫోన్ చేసిన నిఖిల్ అద్వానీ, కథ చెప్పారని.. ఆ టైమ్‌లో ఎమోషనల్ అయిపోయానని తెలిపింది. కొన్నిసార్లు వ్యక్తిగత జీవితం సరైన సమయంలో మూవీ కథలాగే మారిపోతుందని.. తక్షణమే కనెక్ట్ అవుతారని చెప్పింది రాణి.

Read More: Raai laxmi: టాప్‌ అందాలతో హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ

Advertisement

Next Story