నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్.. అగ్ర దర్శకుడి పేరు మెన్షన్ చేసి మరీ ఫైర్

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-17 14:45:40.0  )
నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్.. అగ్ర దర్శకుడి పేరు మెన్షన్ చేసి మరీ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌(Tollywood)లో నటి పూనమ్ కౌర్(Poonam Kaur) మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా మంగళవారం సంచలన ట్వీట్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్‌(Trivikram Srinivas)ని ప్రశ్నించాలని సినీ పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నానని డిమాండ్ చేశారు. ‘గతంలో నేను ఫిర్యాదు చేసినప్పుడు నాకు ఎవరూ సహకరించలేదు. రాజకీయంగా కూడా నేను ఇబ్బందులు ఎదుర్కొన్నాను’ అని పూనం కౌర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, గతంలో పరోక్షంగా త్రివిక్రమ్‌పై ఆరోపణలు చేసిన పూనమ్ కౌర్.. ఈసారి ఏకంగా పేరు మెన్షన్ చేసి మరీ ఆరోపణలు చేయడం ఆసక్తిగా మారింది.

అంతేకాదు.. త్రివిక్రమ్ మీద తాను చేసిన కంప్లైంట్‌ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. తనకు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం మూలంగానే ఆ రోజు తాను చేసిన కంప్లైంట్‌ను సైలెంట్‌గా ఇగ్నోర్ చేశారని ఆవేదన చెందారు. అంతకుముందు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంపైనా పూనమ్ కౌర్ స్పందించారు. మరోసారి జానీని మాస్టర్ అని పిలవొద్దని అభిమానులకు, ఇండస్ట్రీ పెద్దలను కోరారు. అలా పిలిపించుకోవాలంటే గౌరవం ఉండాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి పూనమ్ వ్యాఖ్యలపై ఇండస్ట్రీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Read More..

Jani Master: జానీని ఇకపై 'మాస్టర్' అని పిలవొద్దంటూ ట్వీట్ చేసిన హీరోయిన్

Advertisement

Next Story

Most Viewed