నేను చెడ్డదాన్నే.. గతాన్ని మార్చలేను..నేను చనిపోయాక ఆ పని మాత్రం చేయొద్దు.. ప్లీజ్ : పవన్ కళ్యాణ్ హీరోయిన్ రిక్వెస్ట్

by Sujitha Rachapalli |
నేను చెడ్డదాన్నే.. గతాన్ని మార్చలేను..నేను చనిపోయాక ఆ పని మాత్రం చేయొద్దు.. ప్లీజ్ : పవన్ కళ్యాణ్ హీరోయిన్ రిక్వెస్ట్
X

దిశ, సినిమా : ‘గజ్జె ఘల్లు మన్నాదిరో’ అంటూ ‘ఖుషి’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఆడిపాడింది బ్యూటిఫుల్ ముంతాజ్. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్లామరస్ డాల్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ ప్రస్తుతం ఆధ్యాత్మికతలో మునిగిపోయింది. సినిమా ఫీల్డ్ వదిలేసి దేవుడి స్మరణలోనే కాలం వెల్లదీస్తుంది. ఈ క్రమంలో ఓ చానల్ ఇంటర్వ్యూ చేయగా.. తనకో సహాయం చేయాలని అభిమానులను కోరింది.

‘ నా గతమేంటో ఈ జనరేషన్ పిల్లలకు తెలియదు. నేనెవరో తెలుసుకోవాలంటే వారు గూగుల్ చేస్తరు. jకానీ నేనేం చేసినా నా పాస్ట్‌ను ఎరేజ్ చేయలేను. నా గ్లామరస్ ఫొటోలు వారు చూడొద్దని కోరుకుంటున్నా. ఒకవేళ ఎక్కువ డబ్బు సంపాదిస్తే నా మూవీ రైట్స్ అన్నీ కొనేసి.. వాటిని రిమూవ్ చేయిస్తా. కానీ ఇది జరగదని నాకు తెలుసు. ఒకవేళ నేను చనిపోతే.. నా బ్యాడ్ ఫొటోస్ షేర్ చేయొద్దు ప్లీజ్. లేదంటే నా మనసు బాధపడుతుంది’ అని రిక్వెస్ట్ చేసింది.


Advertisement

Next Story

Most Viewed