చిక్కుల్లో నటి ఖుష్బూ.. రాహుల్ కంటే ముందే మోడీపై ఆ కామెంట్స్

by Javid Pasha |   ( Updated:2023-03-25 12:40:08.0  )
చిక్కుల్లో నటి ఖుష్బూ.. రాహుల్ కంటే ముందే మోడీపై ఆ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: మోడీ ఇంటిపేరు వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష వేసింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ తన ఎంపీ పదవిని కోల్పోయారు. అయితే 2019లో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మోడీ ఇంటిపేరును ప్రస్తావిస్తూ వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యక్తుల పేర్లన్నీ మోడీ ఇంటిపేరుతోనే ఎందుకు ఉన్నాయో చెప్పాలని అక్కడి ఓటర్లను అడిగారు. అయితే రాహుల్ గాంధీ తమను అవమానించారంటూ పూర్ణేశ్ మోడీ అనే గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే.. రాహుల్ పై కేసు పెట్టారు. ఆ కేసును విచారించిన సూరత్ కోర్టు.. రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష వేసింది. ఆ క్రమంలోనే ఆయనను ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించిన లోక్ సభ.. ఆయనను పదవి నుంచి తొలగించింది.

కాగా ఈ వ్యవహారం ఇలా కొనసాగుతున్న వేళ.. బీజేపీ నాయకురాలు, కేంద్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూకు సంబంధించిన ఓ 2018 ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో ‘‘ఇక్కడ మోడీ.. అక్కడ మోడీ.. ఎక్కడ చూసినా మోడీయే.. కానీ ఇదేంటీ? ప్రతి అవినీతిపరుడి పేరు వెనుక మోడీ ఉండటంలో మతలబేంటో అర్థం చేసుకోండి. మోడీకి అర్థం మారుద్దాం. మోడీ అంటే అవినీతి. నీరవ్, లలిత్, నమో = అవినీతి ’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ నాయకురాలిగా ఉన్న ఖుష్బూ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మోడీ ఇంటిపేరు కలిగినవాళ్లను అవమానించారంటూ రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష, ఆయన ఎంపీ పదవి తొలగించారు. మరీ ఆయన కంటే ఓ ఏడాది ముందే ఖుష్బూ అవే కామెంట్స్ చేశారు. మరి ఆమెపై ఎలాంటి యాక్షన్ తీసుకోరా?’’ అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఖుష్బూ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నిరాశ నిస్పృహలో ఉందని, అందుకే గతంలో మోడీపై పోస్ట్ చేసిన తన ట్వీట్ ను ప్రస్తుతం ఆ పార్టీ వైరల్ చేస్తోందని మండిపడ్డారు. ఆ ట్వీట్ చేసినప్పుడు తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, అందుకే ఆ పార్టీ విధానాలకు అనుగుణంగా ఆ ట్వీట్ చేశానని స్పష్టం చేశారు. కాగా 2020లో ఖుష్బూ సుందర్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు.

రాహుల్ అనర్హత వేటుపై షర్మిల రియాక్షన్ ఇదే!

Advertisement

Next Story

Most Viewed