- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నటి హన్సిక పెళ్లికి ప్రత్యేక అతిథులు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: సినీ నటి హన్సిక నేడు పెళ్లి బంధంతో కొత్త జీవితం ప్రారంభించనుంది. తన ప్రియుడు సోహైల్‌ను హన్సిక వివాహం చేసుకోనుంది. జైపుర్‌లోని ఓ రాజకోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో హన్సిక పెళ్లి వేడుక జరుపుకుంటుంది. అయితే, తన పెళ్లిలో పాల్గొనేందుకు కొంతమంది అతిథులకు కూడా హన్సిక ప్రత్యేక ఆహ్వానాలు పంపింది. రాజకోటలో జరిగే పెళ్లికి ప్రత్యేక ఆహ్వానాలు అంటే పెద్ద సెలబ్రిటీలు అనుకోవడం సహజం. కానీ, హన్సిక ప్రత్యేకంగా నిరుపేద చిన్నారులను తన పెళ్లి వేడుకకు ఆహ్వానించింది.
హన్సిక తరచూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. పలు ఎన్జీవోలతో కలిసి నిరుపేద చిన్నారులకు సాయం చేస్తోంది. ఈ క్రమంలోనే తన వివాహానికి అలాంటి కొందరు చిన్నారులకు సైతం ఆహ్వానాలు పంపించి.. పెళ్లికి తమని పిలిచిన హన్సికకు ధన్యవాదాలు చెబుతూ సదరు చిన్నారులు చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, రాజకోటలో జరిగే పెళ్లికి చిన్నారులను ఆహ్వానించి తన గొప్ప మనసుకు చాటుకుందని హన్సికపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక, వివాహ వేదిక పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న చిన్నారులకు హన్సిక ఈ రోజు భోజనాన్ని పంపించనుంది. కాగా, పెళ్లికి ముందు జరిగే మెహెందీ, సంగీత్‌లో కాబోయే దంపతులు హన్సిక, సోహైల్ ఆహ్లాదంగా గడిపారు. సంగీత్‌లో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఆ వీడియోలను హన్సిక సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.