- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పు కప్పిపుచ్చుకోలేరు’’.. వివాదంపై డింపుల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ డింపుల్ హయతీపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఐపీఎస్ రాహుల్ హెగ్డేతో కారు పార్కింగ్ విషయంలో నెలకొన్న వివాదంలో డింపుల్ హయతీపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్ హెగ్డే కారును ఢీకొట్టడమే కాకుండా.. తమతో వాగ్వాదానికి దిగిందని ఐపీఎస్ రాహుల్ హెగ్డే డ్రైవర్ డింపుల్‌పై ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నటిపై కేసు ఫైల్ చేశారు. కాగా, ఈ వ్యవహారంపై తాజాగా హీరోయిన్ డింపుల్ హయతి ట్విట్టర్ వేదికగా స్పందించింది.
‘‘తప్పులను ఏ అధికారం ఆపలేదు.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన తప్పు కప్పిపుచ్చుకోలేరు’’ అని డింపుల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే, ఒకే అపార్ట్ మెంట్‌లో ఉంటున్న నటి డింపుల్, ఐపీఎస్ రాహుల్ హెగ్డే మధ్య గతం నుండే వివాదం జరుగుతోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అపార్ట్ మెంట్‌లో కారు పార్కింగ్ విషయంతో పాటు చెలాన్ల విషయంలో వీరి మధ్య వివాదం జరుగుతోన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత వారం రోజులుగా హీరోయిన్ డింపుల్ హయతి కారుపై ట్రాఫిక్ పోలీసులు చెలాన్లు వేస్తోన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ ఇష్యూపై డీసీపీ రాహుల్ హెగ్డే రియాక్ట్ అయ్యారు. ఇందులో ఎలాంటి వ్యక్తిగత వివాదమేమి లేదని.. పార్కింగ్ విషయంలో డింపుల్ అనవసరమైన వివాదం సృష్టిస్తోందన్నారు. గతంలో చాలాసార్లు ఆమెకు చెప్పినా తీరు మార్చుకోవడం లేదన్నారు. ఇటీవల తన అధికారిక వాహనాన్ని ఆమె ఉద్దేశపూర్వకంగానే ఢీ కొట్టారని.. అలాగే కారును కాలుతో తన్నిందని దీనిపై తన డ్రైవర్ లీగల్‌గానే పోలీసులకు ఫిర్యాదు చేశాడని చెప్పారు. దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగు చూస్తాయన్నారు.