శివాజీ కూతురుతో అలా చేయాలనుకున్న సుధీర్..పగిలిపోద్దీ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్!

by Jakkula Samataha |
శివాజీ కూతురుతో అలా చేయాలనుకున్న సుధీర్..పగిలిపోద్దీ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్!
X

దిశ, సినిమా : సుడిగాలి సుధీర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయిన ఈయన తన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్, మ్యాజిక్ ఇలా ప్రతి దాంట్లో తన ట్యాలెంట్ నిరూపించుకుని బుల్లితెర స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయాడు. కమెడీయన్ నుంచి ఇప్పుడు హీరోగా మారిపోయాడు. అయితే ఆయనకు సినిమాల్లో వరసగా అవకాశాలు రావడంతో, జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయడం, అలాగే పలు సినిమాలు చేస్తూ బిజీగా గడిపాడు. బుల్లితెరకు దూరం అయ్యాడు. అయితే తాజాగా ఆయన బుల్లితెర మీదకు రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ పేరుతో ఓ షోను స్టార్ట్ చేశాడు. ఇందులో సుధీర్ యాంకరింగ్ అందరినీ తెగ ఆకట్టుకుంటుంది. ఇదే కాకుండా ఆహాలో సర్కార్ గేమ్ షో కూడా రన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ గేమ్ షోలో పాల్గొన్న బిగ్ బాస్ కంటెస్టెంట్, నటుడు శివాజీ సుధీర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ గేమ్ షోలో నయని పావని, రతికా రోజ్ కూడా పాల్గొని సందడి చేశారు. నయని శివాజీది డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్ షిప్. వీరు అలా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే నయని షోలోకి ఎంట్రీ ఇవ్వగానే దొరికినంత దోచుకో సాంగ్ వస్తుంది. తర్వాత సుధీర్ ఆమెను హగ్ చేసుకోవడానికి వెళ్లగా, వెంటనే ఆమె శివాజీని హగ్ చేసుకుంటుంది. అప్పుడు శివాజీ, పటేసుకుందామనే అని సుధీర్‌కు కాంటర్ ఇస్తాడు. అప్పుడు నయని పావనికి సుధీర్ నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, శివాజీ పగిలిపోద్దీ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ ఫాదర్ ఉన్నాడు అంటూ చెప్తాడు. ప్రస్తుతం ఈ సీన్ అందరి నోట నవ్వులు పూయిస్తుంది. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో ఈ షో చాలా సందడిగా సాగిపోతూ ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed