మంత్రి అంబటి రాంబాబుపై మరోసారి నటుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-07-31 15:48:50.0  )
మంత్రి అంబటి రాంబాబుపై మరోసారి నటుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా సినిమా సక్సెస్ మీట్‌లో నటుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి అంబటి రాంబాబు ఎవరో తనకు తెలియదన్నారు. ఇమిటేట్ చేసేందుకు అంబటి ఆస్కార్ లెవల్ నటుడు కాదన్నారు. దర్శకుడు సముద్ర ఖని తన క్యారెక్టర్ గురించి ఓ ‘పనికిమాలిన వెదవ, బారుల్లో తాగుతూ, పబ్బుల్లో అమ్మాయిలతో డ్యాన్స్ చేయడమే మీ క్యారెక్టర్’ అని చెప్పారని తాను సినిమాలో అదే చేశానన్నారు.

‘బ్రో’ సినిమా తర్వాత వ్యక్తిగతంగా ఎలా ఉండాలో తెలిసొచ్చిందన్నారు. అయితే తన ఇమిటేట్ చేస్తూ శ్యాంబాబు క్యారెక్టర్‌ చిత్రీకరించడంపై స్పందించిన మంత్రి అంబటి పవన్ కల్యాణ్ ది శునకానందం అని ఫైర్ అయిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో ఎదుర్కొలేకే ఇలాంటి స్టంట్స్ వేస్తున్నారని అంబటి ఫైర్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

Breaking: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం

రామ్ చరణ్‌పై మోజుపడ్డ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

Advertisement

Next Story