ప్రమాదానికి గురైన హీరో.. క్రిటికల్ కండిషన్‌..

by sudharani |   ( Updated:2023-01-02 11:38:55.0  )
ప్రమాదానికి గురైన హీరో.. క్రిటికల్ కండిషన్‌..
X

దిశ, సినిమా : హాలీవుడ్ నటుడు జెరెమీ రెన్నర్ మంచు కురుస్తున్న సమయంలో వెదర్ రిలేటెడ్ యాక్సిడెంట్‌కు గురైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఆయన పరిస్థితి క్రిటికల్‌గానే ఉన్నా స్టేబుల్‌గా ఉన్నాడని మేనేజర్ తెలిపాడు. రెన్నర్ ఫ్యామిలీకి ఇన్ఫర్మ్ చేయగా అక్కడికి చేరుకున్నారని, ప్రస్తుతం అతనితోనే ఉన్నారని వివరించాడు. కాగా షూటింగ్‌ టైమ్‌లో జరిగిన ప్రమాదంలో రెన్నర్ కుడి మోచేయి, ఎడమ మణికట్టు విరిగిందని తెలుస్తుండగా.. వెంటనే అతన్ని విమానంలో ఆసుపత్రికి తరలించారు. ఇక సాధారణంగా న్యూ ఇయర్ రోజున తుఫాను కారణంగా ఉత్తర నెవాడా ప్రాంతంలో భారీ మంచు కురిసిందని, ఆ ప్రాంతంలోనే ప్రమాదం జరిగిందని ఇంటర్నేషనల్ మీడియా ప్రచురించింది.

ఇవి కూడా చదవండి : పాపులర్ కమెడియన్ గుట్టు బయటపెట్టిన ఇన్‌స్టా యూజర్.. ఆ జోక్స్ అన్నీ అక్కడివేనా?

Advertisement

Next Story