- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రశాంత్ జోలికి రావొద్దంటూ అసభ్యంగా మాట్లాడారు.. కన్నీళ్లు పెట్టుకున్న ఆట సందీప్ భార్య
దిశ, సినిమా: బిగ్ బాస్ సీజన్ 7లోకి కంటెస్టెంట్‌గా ఆట సందీప్ ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న విషయం తెలిసిందే. హౌస్‌లో మొదటినుంచి చురుకుగా ఉంటూ 8 వారాలుగా కొనసాగుతూనే ఉన్నాడు. అయితే తాజాగా ఆయన భార్య జ్యోతిరాజ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు షాకింగ్ విషయాలు పంచుకుంది.
జ్యోతి మాట్లాడుతూ ‘ రియాలిటీ షో ఆయనకేం కొత్తకాదు. ఒక్కసారి దిగారంటే కప్పు కొట్టాల్సిందే. కానీ బిగ్ బాస్ అనేది ఒక కొత్త అనుభవం. డ్యాన్స్ వేరు. రియాలిటీ షో వేరు. పెద్ద హీరోలతో కొరియోగ్రఫీ చేయాలన్నదే మా ఆశయం. అందుకోసమే బిగ్‌బాస్‌లో వెళ్లాలని నిర్ణయించుకున్నాం. కానీ మాపై అసభ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు అది చాలా తప్పు. ఫ్యామిలీని ఇందులోకి లాగడం మంచిదేనా? ఆ విషయంలో నేను మాట్లాడి వీడియో పెట్టగానే అసభ్యకరమైన కామెంట్స్ చేశారు ‘నీ మొగుడు వేస్ట్’ అంటూ చెప్పకూడని మాటలు అన్నారు. షోలో ఉన్నవారి కుటుంబాల గురించి మాట్లాడటమేంటి? ప్రశాంత్‌తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ప్రశాంత్ జోలికొస్తే మిమ్మల్ని వదలం. నీ మొగుడికి చెప్పు. ప్రశాంత్ జోలికి రావొద్దని.. అంటూ చెప్పలేనంత అసభ్యంగా మాట్లాడారు’ అంటూ చెప్పుకొచ్చింది జ్యోతి. ప్రజంట్ తన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.