లోదుస్తులు పెట్టే అమ్మాయి ర్యాక్‌లో ప్రపంచంలోనే రెండో అత్యంత ప్రమాదకరమైన విషసర్పం.. ఏం జరిగిందంటే?

by Anjali |   ( Updated:2024-03-18 15:45:42.0  )
లోదుస్తులు పెట్టే అమ్మాయి ర్యాక్‌లో ప్రపంచంలోనే రెండో అత్యంత ప్రమాదకరమైన విషసర్పం.. ఏం జరిగిందంటే?
X

దిశ, ఫీచర్స్: ‘పాము ఒక పాకే జంతువు. కొన్ని జాతుల పాము కాటు ద్వారా స్రవించే విషం మరణానికి దారి తీస్తుంది కాబట్టి చాలామంది వీటికి దూరంగా ఉంటారు. కొంతమంది పాము పేరు తలవడానికి కూడా ఇష్టపడరు. అనుకోకుండా ఎక్కడైనా పాము కనిపిస్తే మళ్లీ ఆ ప్లేస్ కు వెళ్లడానికి కూడా సాహాసం చేయరు. కప్పలు, ఎలుకలు, పక్షిగుడ్లు వీటికి ఆహారం. అడవులు, గుబురుగా ఉన్న చెట్లు, నీళ్లు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అప్పుడప్పుడు ఎలుకల వేట కోసం ఇళ్లలోకి కూడా వస్తుంటాయి. అయితే తాజాగా ఆస్ట్రేలియాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

ఓ మహిళ తన కుమార్తె గదిలో లోదుస్తుల ర్యాక్ క్లీన్ చేస్తుండగా.. సడన్ గా బట్టల్లోంచి పాము దర్శనమిచ్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా పరుగులు తీసింది. తర్వాత స్నేక్ క్యాచర్ అయిన మార్క్ పెల్లీనికి సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ రూంలో ఉన్న పామును చూసి ఈ పాము ప్రపంచంలోనే రెండో అత్యంత విషపూరిత బ్రౌన్ స్నేక్‌ సర్పమని ఆయన తెలిపాడు. మార్క్ పెల్లీని 6 గంటలు కష్టపడి బ్రౌన్ స్నేక్‌ ను పట్టుకున్నాడు. ఈ పాము కాటు వేస్తే సెకన్ల వ్యవధిలోనే మనిషి ప్రాణాలు కోల్పోతాడని వివరించాడు. ఇక ఆ పామును బంధించి అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని ఆ మహిళ ట్విట్టర్ వేదికన పంచుకుంది.

Advertisement

Next Story

Most Viewed