- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నానిని కట్టిపడేసిన రియల్ తండ్రీకూతుళ్ల ప్రేమ.. ఇది కదా ఆస్తి అంటూ నాని రీట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా సినిమా ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. డిసెంబర్ 7న విడుదలై మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఎమోషనల్ డ్రామగా వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్‌లో అద్భుతంగా రాణిస్తుంది. మరీ ముఖ్యంగా.. యూఎస్‌లో అదరగొడుతోంది. ఇక.. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఎమోషనల్ అవ్వడమే కాకుండా.. సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో ‘హాయ్ నాన్న’ సినిమా చూసిన అనంతరం ఒక చిన్నారి తన తండ్రిని గట్టిగా హత్తుకుని కంటతడి పెట్టుకుంది. తన తండ్రి తనపై చూపించిన ప్రేమను తలుచుకుని భావోద్వేగానికి గురైంది. ఆ బాలికను తండ్రిని ఓదార్చాడు. ఈ దృశ్యాన్ని కెమెరాలో రికార్డ్ చేసిన ఓ వ్యక్తి ఎక్స్‌లో పోశారు. అంతే కాకుండా ఆ పోస్ట్‌ను నానికి ట్యాగ్ చేస్తూ ‘‘నాని మీ మూవీ చాలా అద్భుతంగా ఉంది. చూసిన ప్రతి ఒక్కరిని ఎమోషనల్‌గా కదిలించింది. ఎంతో మంది తండ్రీకూతుళ్ల మధ్య బంధాన్ని బలోపేతం చేసింది. ఇలాంటి సినిమాను ఎంచుకున్నందుకు చాలా థాంక్స్’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్‌పై స్పందించిన నాని ‘ఇది కదా ఆస్తి’ అంటూ రీట్వీట్ చేశాడు.