- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'2 గంటల ప్రయాణం 20 నిమిషాల్లోనే'.. రష్మిక కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, నటనతో కుర్రకారులో నేషనల్ క్రష్ అనే బిరుదును సొంతం చేసుకుంది. తర్వాత సరిలేరు నీకెవ్వరు, గీతా గోవిందం, పుష్ప సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇటీవల యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న నేషనల్ క్రష్.. ఇప్పుడు పుష్ప 2, రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్, కుబేర వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఈ నాలుగు చిత్రాలు కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా రీసెంట్‌గా రష్మిక ముంబయి ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సముద్రపు వంతెన 'ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్' పై ప్రయాణించారు. అందులో భాగంగా ఆ వంతెనపై తన ప్రయాణ అనుభూతిని షేర్ చేసుకున్నారు. రెండు గంటల ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి చేయొచ్చని. ఇప్పుడు మనం ముంబయి నుంచి నవీ ముంబయి సులువుగా ప్రయాణించవచ్చని తెలిపారు.
ఇటీవల ఆమె ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇప్పుడు మనల్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. యువ భారత్ దేన్నయినా సాధించగలదన్న రష్మిక.. గత పదేళ్లలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని చెప్పారు. దేశంలో మౌలిక వసతులు, రహదారి ప్రణాళిక అద్భుతంగా ఉన్నాయన్న ఆమె.. అభివృద్ధికే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.