- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆటోరంగం ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు : మోతీలాల్ ఓస్వాల్
దిశ, సెంట్రల్ డెస్క్: ఆటోరంగానికి తిప్పలు తప్పవని, గత 18 రోజులుగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న క్రమంలో ఆటో రంగం తిరిగి రికవరీ అవడానికి ఇంకా ఆలస్యమవుతుందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. ఆటోరంగం ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని పేర్కొంది. గత కొంతకాలంగా పరోక్ష పన్నుల పెంపుతో తొలిసారిగా డీజిల్ ధరలు పెట్రోల్ ధరలతో సమానస్థాయిలో పోటీపడుతోంది. బీఎస్-6 సంబంధిత వ్యయం, ఇంధన ధరల్లో మార్పులు వినియోగదారుల ప్రాధాన్యతలను ఇంకా అధికంగా ప్రభావిత చేస్తాయని మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. అయితే, టూవీలర్ వాహనాలకు డిమాండ్ ఇప్పుడున్నట్టుగా కొనసాగుతుందని పేర్కొంది. ఉదాహరణకు, డీజిల్ వాహనాల వాటా 2012-13 ఆర్థిక సంవత్సాంలో దాదాపు 58 శాతంగా ఉంది. అధి 2019-20 ఆర్థిక సంవత్సరానికి 29 శాతానికి క్షీణించిందని మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించింది. ఇంధన ధరల మధ్య వ్యత్యాసం ఎనిమిదేళ్ల క్రితం రూ. 30 వరకూ ఉండగా, ఇప్పుడు రెండూ సమానంగా ఉన్నాయి. కాబట్టి, డీజిల్‌తో నడిచే వ్యక్తిగత వాహనాల విభాగాలకు డిమాండ్ ఊహించని స్థాయిలో తగ్గిపోతుందని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొన్నారు.