మాతృత్వం ఓ అద్భుతమైన శక్తి.. తల్లి అయ్యేంత వరకూ తెలియలేదు: బాలీవుడ్ నటి

by Shyam |   ( Updated:2021-11-01 04:43:56.0  )
మాతృత్వం ఓ అద్భుతమైన శక్తి.. తల్లి అయ్యేంత వరకూ తెలియలేదు: బాలీవుడ్ నటి
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి అమృతా రావు తన భర్త ఆర్‌జే అన్మోల్‌తో కలిసి తన కొడుకు ‘వీర్’ పుట్టిన రోజు వేడుక జరుపుకుంటోంది. ఇందుకు సంబంధించిన పిక్స్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. వీర్ ఫస్ట్ బర్త్ డే సందర్భంగా బాంబే టైమ్స్‌తో మాట్లాడిన అమృత..‘నా కొడుకు వీర్‌తో పాటు నేను కూడా అమ్మగా ఏడాది పూర్తి చేసుకున్నా. ఇందుకు నా బిడ్డకు థాంక్స్ చెప్పుకుంటున్నా.

కోవిడ్ కారణంగా మా కుంటుంబ సభ్యులతో మాత్రమే ఈ వేడుక జరుపుకుంటాము. ఓ జంతువు ఆకారంలో వీర్ కోసం స్పెషల్ కేక్ రెడీ చేశాను. ఇక నా మొదటి సంతానం పుట్టినరోజు వేడుక సందర్భంగా సీనియర్ సిటిజన్‌ల కంటి వ్యాధులకు సంబంధించి కొంత ఆర్థిక సాయం అందిస్తున్నాం’ అని ఆమె తెలిపింది.

పేరెంట్ హుడ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత జీవితంలో చాలా మార్పులు వచ్చాయని, బిడ్డ పుట్టిన తర్వాత తన లైఫ్ షెడ్యూల్ తన కంట్రోల్‌లో లేదని చెప్పింది. ఇక గత పద్దెనిమిది నెలలుగా నిద్ర సరిగా ఉండటం లేదని తెలిపిన నటి.. ‘మాతృత్వం అనేది మనకు తెలియని ఓ అద్భుతమైన శక్తి. తల్లి అయ్యేంత వరకూ ఎవరికీ తెలియదు’ అని మాతృత్వం గొప్పతనం గురించి అమృత చెప్పింది.

Advertisement

Next Story