కొడుకును చంపిన తల్లి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Sridhar Babu |
కొడుకును చంపిన తల్లి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. కొడుకును బావిలో పడేసి కన్నతల్లి హత్యచేసిన ఉదంతం కలకలం రేపింది. పెద్దపల్లి పట్టణంలోని మొగల్‌పుర‌కు చెందిన శ్యామల.. కొడుకు బన్ని(14) మానసిక పరిస్థితి సరిగ్గా లేదన్న కారణంతో వదిలించుకోవాలని పథకం వేసింది. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రికి చికిత్స చేయించాలని చెప్పి సోమవారం ఇంట్లో నుంచి తీసుకెళ్లింది. పథకం ప్రకారం.. వ్యవసాయ పొలంలోకి తీసుకెళ్లి.. అక్కడే ఉన్న బావిలోకి బన్నిని నెట్టివేసింది. ఈతరాకపోవడంతో ఆ బాలుడు బావిలో శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసుకొని విచారించగా.. హత్య చేసింది శ్యామల అని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story