- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్ డెస్క్: అప్పుడే పుట్టిన శిశువును కన్నతల్లే కడతేర్చింది. బాత్రూమ్ కిటికీలోంచి కిందపడేసింది. దీంతో ఆ శిశువు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భాగ్యనగర్ బ్లాక్ కు చెందిన మహిళకు భర్తతో గొడవల కారణంగా ఆమె తన తల్లి గారి ఇంటికి వచ్చి అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో మరో వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. ఆమెకు పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ, అప్పుడే పుట్టిన ఆ బిడ్డను ఆమే కడతేర్చింది. తన బిడ్డతోపాటు ఆస్పత్రిలోని బాత్రూమ్ లోకి వెళ్లి కిటికీలోంచి కిందపడేసింది. దీంతో ఆస్పత్రిలోని నర్సుకు అనుమానమొచ్చి ఆమెను ప్రశ్నించింది. విషయం చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి కిందకు వెళ్లి చూడగా తీవ్ర గాయాలతో ఆ చంటిపాప కనిపించింది. వెంటనే ఆ శిశువును పిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ శిశువు మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
- Tags
- mother killed