- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొడుకా… నీ వెంటే నేను
దిశ, ఆదిలాబాద్: ఊయాల్లో వేసి ఊపింది. లాలించి లాల పోసింది. బుజ్జగించి గోరు ముద్దలు పెట్టింది. ఏడిస్తే బాధ పడింది. కన్నీరు పెడితే కడుపులో పెట్టుకుంది. జ్వరమొస్తే తల్లిడిల్లింది. ఆకలేస్తే రోమ్ముతో పాలు పట్టింది. ఎదపై నిలబెట్టి, ఆట పాటలతో పలకరింపులు నేర్పింది. కనుపాపే శ్వాసనుకుంది. ప్రతిక్షణం ఆ శ్వాసే ధ్యాసగా బతికింది. బడికి పోనంటే బరిగెతో కొట్టింది. ఏటికేడు ఎదుగుతుంటే సంబరపడింది. కొడుకే బతుకు అనుకుంది. బతుకంతా కొడుక్కే ఇచ్చింది. ఇలా ప్రతి నిమిషం పరితపిస్తూ కోటి ఆశలతో కొడుకు కోసం బతుకును సాగిస్తూ వచ్చింది. కానీ దేవుడు తల్లీకొడుకు బంధాన్ని విడదీయడంతో ఆ తల్లి గుండెలవిసేలా ఏడ్చి ఏడ్చి కొడుకు దగ్గరికే వెళ్లిపోయింది. ఈ విషాద సంఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జరగ్గా వివరాలు ఇలా ఉన్నాయి.
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం మాడెల్లి గ్రామంలో రాదండి రాజేశ్వరి అనే మహిళకు 15ఏళ్ల కొడుకు సంపత్ ఉన్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో కొద్దిరోజులుగా ఇంట్లోనే ఉంటున్న సంపత్ శనివారం మిత్రులతో కలిసి ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. ఇదే క్రమంలో గ్రామ శివారులోని ఓ బావిలో ఈతకు వెళ్లి మునిగి చనిపోవడంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకు కొన్నిగంటల గంటల వ్యవధిలోనే కానరాని లోకాలకు పోవడంతో తల్లి తట్టుకోలేక పోయింది. చేతికి అంది వచ్చిన కొడుకు మృతదేహాన్ని చూసి స్పృహతప్పి పోయింది. కన్నపేగు తన కళ్ల ముందే విగత జీవిగా మారడంతో బాధను దిగమింగుకోలేక గుండెలు బాదుకుంది. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి కొడుకును తలచుకుంటూ బోరున విలపించిన తల్లి రాజేశ్వరి తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు వాహనం మాట్లాడి వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చివరి శ్వాస విడిచి కొడుకు దగ్గరకు వెళ్లిపోయింది. ఒక్కరోజు వ్యవధిలోనే కొడుకు మృతిని తట్టుకోలేక కన్నతల్లి కాటికి పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.