దాని కోసం బిడ్డను ఇనుపచువ్వతో కాల్చిన తల్లి.. కానీ, చివరకు..

by Anukaran |   ( Updated:2021-07-12 05:26:19.0  )
crime news
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ కన్నతల్లి అజ్ఞానం.. కన్నబిడ్డ చావుకు దారితీసింది. ఆమె మూఢనమ్మకం.. కడుపుకోతను మిగిల్చింది. ఆమె చేసిన ఆ అమాయయకమైన పని.. కళ్లు కూడా తెరవని పసికందును కాటికి పంపింది. బిడ్డకు అనారోగ్యంగా ఉందని, తాంత్రిక విద్య తెలిసిన దానిలా ఓ మహిళా బిడ్డ పొట్టపై ఇనుప చువ్వతో కాల్చింది. వేడి తట్టుకోలేని చిన్నారి తల్లి ఒడిలోనే ప్రాణాలు విడిచింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌ లో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. భిల్వారా జిల్లా, మండల్ బ్లాక్‌లోని లుహరియా గ్రామంలో రమేష్ బగారియా, ఆయన భార్య లాహరి నివసిస్తున్నారు. వారికి 5 నెలల క్రితం పాప పుట్టింది. ఈ క్రమంలోనే చిన్నారి కొన్ని రోజులుగా అస్వస్థతకు గురైంది. సరిగ్గా పాలు తాగడం లేదు.. ఎప్పుడు ఏడుస్తూ ఉంది. దీంతో తల్లి చిన్నారిని హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా తాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లాలని ప్రయత్నించింది. కానీ, వారి ఊరిలో ఉండే తాంత్రికుడు పక్క ఊరు వెళ్లాడని తెలియడంతో.. ఆమె సొంత వైద్యానికి సిద్దమయ్యింది. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే పొట్టపై కాల్చాలని ఎక్కడో విన్న మాట పట్టుకొని అదే విధంగా చేయడానికి రెడీ అయ్యింది.

ఆలస్యం చేయకుండా బిడ్డను నిద్రపుచ్చి.. ఎర్రగా కాల్చిన ఇనుప చువ్వను పసికందు పొట్టపై అంటించింది. దీంతో పాపకు వ్యాధి నయం అవుతుందని భావించింది. అంత వేడి తట్టుకోలేని చిన్నారి గుక్కతిప్పుకోకుండా ఏడుపు మొదలుపెట్టింది. దీంతో వెంటనే వారు పసికందును మహాత్మా గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ పసికందు తల్లి ఒడిలోనే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు భార్యాభర్తలను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story