తల్లీ కొడుకులు ఎలా మృతి చెందారు?

by srinivas |

తల్లీకొడుకుల మృతి నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. మృతి చెందిన రెండు రోజుల తరువాత విషయం బయటపడడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరంలో అనసూయమ్మ (70), ఆమె కుమారుడు గోపాల్‌రెడ్డి (45) నివసిస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఎవరూ బయటకు రావడం లేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రెండు రోజులుగా వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తోంది. అది పెరుగుతుండడంతో స్గానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఇంట్లోకి వెళ్లి చూసిన పోలీసులు షాక్ అయ్యారు. ఇద్దరూ మృతి చెంది కనిపించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు.

Tags: mother and son dead, nellore district, ap, gangavaram

Advertisement

Next Story