స్కామ్‌ను పరిచయం చేసిన ‘మోసగాళ్లు’

by Jakkula Samataha |
స్కామ్‌ను పరిచయం చేసిన ‘మోసగాళ్లు’
X

దిశ, వెబ్‌డెస్క్: మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. ప్రపంచంలోనే అతి పెద్ద సాంకేతిక కుంభకోణం ఆధారంగా రూపొందుతున్న సినిమాకు జెఫ్రీ గీ చిన్ దర్శకుడు కాగా.. ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మించారు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం చిత్రాల్లో త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తూ.. స్కామ్ గురించిన చిన్న గ్లింప్స్ రివీల్ చేసింది మూవీ యూనిట్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేసిన టీజర్‌కు సూపర్ టాక్ రాగా.. స్కూల్ మేట్, చిన్ననాటి స్నేహితుడు విష్ణు, డియరెస్ట్ కాజల్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

మోసగాళ్లు టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండగా.. నెటిజన్లు కూడా అమేజింగ్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ‘450 మిలియన్ డాలర్ల విలువైన ఐటీ స్కామ్ గురించి ట్రంప్ స్పందనకు స్కామర్స్ రిప్లై ఎలా ఉంది? ఇది సరిపోతుందా.. ఇంకా చేద్దాం అనుకుంటున్నారా? ఆట ఇప్పుడే మొదలైంది’ అంటున్న మంచు విష్ణు, కాజల్ అగర్వాల్.. బాక్సాఫీస్ షేకింగ్ ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వగలరని, బిగ్గెస్ట్ స్కామ్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్తున్నారు ఫ్యాన్స్. చాలా రోజుల తర్వాత విష్ణు నుంచి వస్తున్న ఈ సినిమాలో తను సూపర్ స్టైలిష్‌గా ఉండగా.. కాజల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.

Advertisement

Next Story