- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంత ఇంటిని కొనాలనుకునేవారు పెరిగారు
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశీయంగా చాలామంది సొంత ఇంటిని కలిగి ఉండటంలోని ప్రాముఖ్యతను గుర్తించారని ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫామ్ నోబ్రోకర్ డాట్ కామ్ తెలిపింది. ముఖ్యంగా మన దేశంలో సొంత ఇంటికి అధిక ప్రాధాన్యతనిస్తారు. అయితే ఇంతకుముందు కంటే ఇప్పుడు స్థిరాస్తి కొనుగోళ్లపై ఆలోచన మారింది. కరోనా వ్యాప్తి తర్వాత అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రజలు ఎలాగైనా సరే 2021లో సింత ఇంటిని కలిగి ఉండాలని నిర్ణయించుకున్నారు.
దీనికితోడు గృహ రుణాల రేట్లు తక్కువగా ఉండటం, రియల్ కంపెనీల నుంచి మెరుగైన ఆఫర్లు రావడంతో ఇల్లు కొనేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సొంత ఇంటిని కొనుగోలు చేసే వారి సంఖ్య కరోనా మహమ్మారి కంటే ముందున్న దానికంటే అధికంగా పెరిగిందని నివేదిక వెల్లడించింది. దీనికితోడు తక్కువ గృహ రుణాల రేట్లు ఉండటం, బిల్డర్ల నుంచి ఆకర్షణీయమైన ఆఫర్లు పెరగడంతో ఈ డిమాండ్ మరింత పెరిగిందని నివేదిక పేర్కొంది.
నోబ్రోకర్ డాట్ కామ్ నివేదిక అందించిన వివరాల ప్రకారం..2021లో 82 శాతం మంది ఆస్తిని కొనుగోలు చేయాలని భావిస్తున్నారని, గతేడాదిలో ఈ ఆసక్తిని 64 శాతం మంది మాత్రనే వ్యక్తపరిచారని తెలిపింది. ఈ నివేదికను రూపొందించేందుకు కోటి మంది వినియోగదారులను కలిగిన ఈ ప్లాట్‌ఫామ్ దాదాపు 18 వేల మంది నుంచి వివరాలను సేకరించినట్టు తెలిపింది. వీరిలో 89 శాతం మంది ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తిని కొనుగోలు చేయడం సరైన నిర్ణయంగా చెప్పారు.
మెట్రో నగరాల్లో నివసించే వారు ముఖ్యంగా కుటుంబ సభ్యులందరికీ అనువైన పెద్ద ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారని తేలింది. ‘ఈ ఏడాది కరోనా వ్యాప్తి వల్ల లాక్‌డౌన్ సమయంలో తక్కువ ఖర్చు చేశారు. దీంతో పొదుపు మెరుగ్గా ఉండటం, బిల్డర్ల నుంచి భారీగా డిస్కౌంట్ ఆఫర్లు రావడం, రుణాల వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉండటంతో 82 శాతం మంది ప్రజలు 2021లో ఇల్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారని’ నోబ్రోకర్ డాట్ కామ్ సహ-వ్యవస్థాపకుడు సౌరభ్ గార్గ్ చెప్పారు. గృహ రుణాల వడ్డీ రేట్లు, అద్దె చెల్లింపుల మధ్య వ్యత్యాసం 4.5 నుంచి 5 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు గృహాల అమ్మకాల్లో భారీగా పెరుగుదల ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నివేదిక సేకరించిన వివరాల ప్రకారం..48 శాతం మంది 2బీహెచ్‌కే, 9 శాతం మంది 3బీహెచ్‌కే ఇళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది.