- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిందూ యువతులను ప్రేమించకండి.. ఎంపీ సలహా!
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో లవ్ జిహాద్ అంశంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. హర్యానాలో హిందూ యువతి పెళ్లికి నిరాకరించిందని ఓ ముస్లిం యువకుడు తుపాకితో కాల్చి చంపడంతో లవ్ జిహాద్ అంశం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండేందుకు బీజేపీ పాలిత రాష్ట్రాలు కఠినమైన కొత్త చట్టాలు తీసుకొచ్చేందుకు రెడీగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే యూపీకి చెందిన మొరాదాబాద్ ఎంపీ ఎస్టీ హసన్ ముస్లిం యువతకు ఓ సలహా ఇచ్చారు. ‘హిందూ యువతులను ప్రేమించవద్దని, వారిని మీ చెల్లెళ్లు భావించాలని సూచించారు‘. యూపీ సీఎం యోగి తీసుకొచ్చిన లవ్ జిహాద్ ఆర్డినెన్స్‌ను ఓ పొలిటికల్ స్టంట్‌గా ఆయన అభివర్ణించారు. మన దేశంలో చాలా మంది మతంతో సంబంధం లేకుండా తమ జీవిత భాగస్వాములను ఎంచుకుంటున్నారు. హిందువులు, ముస్లింలను.. ముస్లింలు హిందువులను పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
అయితే, ఇలాంటివి చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఇక లవ్ జిహాద్ కేసు విషయంలోకి వస్తే.. తమను ప్రేమిస్తున్న అని వెంటపడే యువకులు ముస్లింలు అని హిందూ అమ్మాయిలకు ముందే తెలుసు. కానీ, సమాజం, పేరెంట్స్ నుంచి వచ్చే ఒత్తిళ్ల కారణంగా వాళ్లు ముస్లిములు అని తమకు తెలియదన్నట్లుగా అమ్మాయిలు వ్యవహరిస్తారు. అప్పుడు దానికి ‘లవ్ జిహాద్’ అని పేరు పెడతారని హసన్ వివరించారు. అందుకే హిందూ యువతులందరినీ ముస్లిం అబ్బాయిలు తమ సోదరీమణులుగా చూడాలని సూచించారు. లేనియెడల యూపీలో ఓ చట్టం రెడీ అయిందని, దీని కారణంగా మిమ్మల్ని దారుణంగా హింసిస్తారు. మిమ్మల్ని మీరే రక్షించుకోండి. ప్రేమ జోలికి వెళ్లొద్దంటూ స్వయాన ఎంపీ చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.