మందేసిన మంకీస్..

by Anukaran |   ( Updated:2021-04-09 04:33:15.0  )
మందేసిన మంకీస్..
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా దేశాన్ని పట్టి పీడిస్తుంది. దీని వలన మనుషులతో పాటు జంతువులు, పక్షులు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. లాక్ డౌన్ కారణంగా వాటికి తిండి దొరక్క ఆకలితో అలమటిస్తున్నాయి. తాజాగా కొన్ని కోతులు దాహం తీర్చుకోవడానికి మద్యం షాపు వద్ద ఉన్న ఖాళీ బీర్ బాటిల్స్ ని తాగుతూ కనిపించాయి. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బెంగళూరు రూరల్‌ విజయపుర పట్టణంలో కొన్ని కోతులు మద్యం షాపు వద్ద రచ్చ చేసాయి. ఎప్పటి నుండో ఆకలితో అలమటిస్తున్న కోతులు మద్యం షాపు వద్ద దొరికిన బీర్ బాటిల్స్ ని, వాటర్ పాకెట్స్ ని ఒక దగ్గర చేర్చి ఆబగా తాగేస్తూ కెమెరా కంటికి చిక్కాయి. ప్రస్తుతం ఈ కోతుల మందు పార్టీ నెట్టింట వైరల్ గా మారాయి

Advertisement

Next Story

Most Viewed