సింహాలకే చుక్కలు చూపించిన ముంగిస

by Shamantha N |
సింహాలకే చుక్కలు చూపించిన ముంగిస
X

దిశ, వెబ్ డెస్క్: దాదాపుగా సింహాలంటే మిగతా జంతువులు చాలా భయపడుతుంటాయి. అది ఎక్కడ దాడి చేసి చంపుతుందోనని ఆందోళన చెందుతుంటాయి. అలాంటిది.. ఓ ప్రాంతంలో ఓ చిన్నపాటి ముంగిస… నాలుగు సింహాలకు చుక్కలు చూపించింది. వివరాల్లోకి వెళితే.. ఓ ఐఎఫ్ఎస్ అధికారి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నాలుగు సింహాలపై ఎదురుదాడి చేస్తూ భయపెట్టించ సాగింది. వాటి నుంచి తప్పించుకుంటూ భూమిలో ఉన్న రంధ్రంలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆ సింహాలు అక్కడి చేరుకోగానే మళ్లీ ఆ ముంగిస ఆ రంధ్రంలో నుంచి బయటకు వచ్చి వాటిని బెదిరించసాగింది. ఇది చూసిన నెటిజన్లు బాగుందంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed