మోడీ దేశ ద్రోహి..కేసీఆర్ సెక్యూలరిజానికి బ్రాండ్

by Shyam |
మోడీ దేశ ద్రోహి..కేసీఆర్ సెక్యూలరిజానికి బ్రాండ్
X

దిశ, న్యూస్‌బ్యూరో : దేశంలో మతం పేరుతో విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తున్న ప్రధాని మోడీయే దేశ ద్రోహి.. సీఎం కేసీఆర్ సెక్యూలరిజానికి బ్రాండ్ అంబాసిడర్ అని ప్రభుత్వ విఫ్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. కేంద్రంలో బీజేపీ పెద్దలు దేశ ద్రోహానికి పాల్పడుతున్నందునే సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్సీఆర్‌‌లకు వ్యతిరేకంగా శాసనసభ, మండలి చేసిన తీర్మానాలను అన్ని పార్టీలు అభినందిస్తున్నాయన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంతో బీజేపీ డిఫెన్స్‌లో పడిపోయిందన్నారు. అవగాహన లేని బీజేపీ కొత్త అధ్యక్షుడు సీఎం కేసీఆర్‌ను దేశ ద్రోహి అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ రెండో రోజే ప్రజల్లో పలుచ బడ్డారన్నారు.సీఏఏపై కేంద్ర తన మొండి వైఖరి వీడక పోతే కేసీఆర్ దేశవ్యాప్తంగా మొదలయ్యే ఉద్యమానికి నాయకత్వం వహిస్తారన్నారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్‌ను బీజేపీ నేతలు దేశ ద్రోహిగా ముద్ర వేసే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు సహించరని తెలిపారు.
Tags: modi is anti nationalist,kcr secularist, mlc karne prabakar, ts, delhi

Advertisement

Next Story