ఫోన్ల లోడుతో వెళ్తున్న కంటైనర్ చోరీ

by Sumithra |
ఫోన్ల లోడుతో వెళ్తున్న కంటైనర్ చోరీ
X

దిశ, వెబ్‎డెస్క్ : మొబైల్ ఫోన్ల లోడుతో వెళ్తున్న కంటైనర్‎ను లూటీ చేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ భారీ దోపిడీ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎంఐ ఫోన్స్ లోడుతో హైవేపై వెళ్తున్న కంటైనర్‎ను దొంగల ముఠా అడ్డగించింది. కంటైనర్ డ్రైవర్‎ను చితకబాది అతడిని అక్కడే వదలేసి వాహనంతో పరారయ్యారు. సుమారు సెల్‎ఫోన్ల విలువ రూ.15 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story