కరోనాపై కీరవాణి ట్యూన్

by Shyam |
కరోనాపై కీరవాణి ట్యూన్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సినీ ప్రముఖుల కృషి గొప్పగా ఉంది. హీరోలు, హీరోయిన్లు తమదైన రీతిలో జనాల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇంటికి ఎందుకు పరిమితం కావాలనే దానిపై వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే మనమేం చేస్తే.. కరోనా చైన్ బ్రేక్ చేయగలమో చెప్తూ సాంగ్ రిలీజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ M.M.కీరవాణి. ‘స్టూడెంట్ నెం. 1’ సినిమాలో ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ‘ సాంగ్ ట్యూన్‌కు న్యూ రిలిక్స్‌తో కంపోజ్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేశారు.

‘ఓ మైడియర్ గార్ల్స్… డియర్ బాయ్స్… డియర్ మేడమ్స్… భారతీయులారా’ అంటూ మొదలైన పాట ఆద్యంతం ఆకట్టుకుంది. “ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే చేరింది మహమ్మారి రోగమొక్కటి …. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండి ఉక్కు సంకల్పంతో తరుముదాము దాన్ని బయటికి .. వి విల్ స్టే ఎట్ హోం… వి విల్ స్టే ఎట్ హోం… వి స్టే సేఫ్” సాంగ్ లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. అబద్ధపు వార్తలు నమ్మొద్దని… విందులు, పెళ్లిలకు హాజరుకావొద్దని పాట ద్వారా పిలుపునిచ్చిన కీరవాణి.. వ్యాయామం అవసరమని, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని, వేడి నీళ్లు తాగాలని సూచించారు. డాక్టర్లు, నర్సులను మనుషుల్లో దేవుళ్లుగా పోల్చిన కీరవాణి… పోలీసులను సమరయోధులుగా అభివర్ణించారు. పారిశుధ్య కార్మికులకు తల్లిదండ్రుల కంటే ఎక్కువ రుణపడి ఉంటామని… మానవసేవకు అంకితమైన వారు క్షేమంగా ఉండాలని ప్రార్థించాలని కోరారు.


Tags: M.M. Keeravani, Coronavirus, Covid19, Song

Advertisement

Next Story

Most Viewed