- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెడికల్ కాలేజీ రగడ.. రాజకీయాలొద్దు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లాకు కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీ, దాని అనుబంధ హాస్పిటల్ ఏర్పాటు విషయంలో రాజకీయాలు వద్దని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాకు కొత్తగా మంజూరు చేసిన మెడికల్ కళాశాల, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు విషయంలో టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. జిల్లాకు అనుబంధంగా ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్‌కు చెందిన చాలా గ్రామాలకు జగిత్యాల జిల్లా కేంద్రం మధ్యలో ఉందని, ఆ గ్రామాల నుండి వచ్చే ప్రజలకు చల్‌గల్ వ్యవసాయ క్షేత్రం ప్రధాన రహదారికి మరియు బైపాస్ రోడ్డుకు దగ్గరలో ఉంటుందని, దీనివలన ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని అన్నారు.
మెడికల్ కళాశాల, అనుబంధంగా ఏర్పాటుచేసే 500 పడకల ఆసుపత్రి ఎక్కడ ఉండాలో తెలియక రాజకీయాలు చేస్తున్నారని, ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్న ప్రదేశంలో ఏర్పాటు చేయాలన్నారు. టీఆర్ఎస్ నాయకులు మాత్రం నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం దరూర్ క్యాంపులో కాలేజీ ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మెడికల్ కళాశాల ఏర్పాటు జరగాలని, దానికి అనుబంధంగా ఉండే ఆసుపత్రి విస్తరణకు కావలసిన ప్రభుత్వ భూమి విస్తారంగా చల్‌గల్ వ్యవసాయ క్షేత్రం వద్దే ఉందని వివరించారు. ఇదే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసినట్టు ఎమ్మెల్సీ స్పష్టంచేశారు. ఇప్పటికైనా మెడికల్ కళాశాల ఏర్పాటు విషయంలో టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు మానుకుని భవిష్యత్తు తరాలు అభినందించేలా మెడికల్ కాలేజీ నిర్మాణం జరగాలన్నారు.