- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వంట కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
దిశ, జగిత్యాల: వంట కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఆధ్వర్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా 54 వేల మంది కార్మికులు తమ హక్కుల పరిష్కారం కోసం గత రెండు రోజుల నుంచి నిరసన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలో భాగంగా జగిత్యాల జిల్లా వంట కార్మికుల నిరసన దీక్ష శిబిరానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. వంట కార్మికులకు గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ప్రభుత్వ పాఠశాల వంట కార్మికులను వెట్టి చాకిరి చేయించవద్దని, వంట కార్మికుల కష్టాలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవ తీసుకోవాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, ధర రమేశ్, రాధ కిషన్, యూత్ నాయకులు ముంజాల రఘువీర్ గౌడ్, లైసెట్టి విజయ్, మహిపాల్, తిరుపతి పాల్గొన్నారు.