ప్రాణం ఉన్నంత వరకు దుబ్బాక ప్రజలతో ఉంటా : ఎమ్మెల్సీ ఫారూఖ్

by Shyam |
MLC Farooq
X

దిశ, దౌల్తాబాద్: సంస్కృతి సంప్రదాయాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ అన్నారు. శనివారం రాయపోల్ మండల కేంద్రంలో ఆడపడుచులకు ప్రభుత్వం అందజేస్తోన్న బతుకమ్మ చీరలను ఎమ్మెల్సీ పంపిణీ చేశారు. అంతకు ముందు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచారని ఆయన అన్నారు. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అధిష్టానాలు ఉంటాయని, కానీ తెలంగాణకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలే అధిష్టానం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్ని పండుగలకు ప్రభుత్వం చేయూత అందించి, వారి కుటుంబాల్లో సంతోషం నింపుతోందని అన్నారు. గ్రామస్థాయి నుంచి సీఎం కేసీఆర్ ఎదిగి ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనకు ప్రజల కష్టసుఖాలు బాగా తెలుసని అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు దుబ్బాక ప్రజలను మరువబోను అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారని ఈ విషయాన్ని రాయపోల్ జెడ్పీటీసీ యాదగిరి తన దృష్టికి తీసుకొచ్చారని, ఆ పోస్టు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేగాకుండా.. అతనిపై సిద్దిపేట సీపీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఇటీవల పాముకాటుకు గురై చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ నాయకులు పరశరాములు కుమారుడు స్వామిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కల్లూరి అనిత శ్రీనివాస్, జెడ్పీటీసీ యాదగిరి, తహసీల్దార్ శ్రీవల్లి, ఎంపీడీవో రాజేష్ కుమార్, ఎంపీవో నరసింహారావు, రాయపోల్ సర్పంచ్ మౌనికా రాజిరెడ్డి, ఎంపీటీసీ యాదమ్మ, టీఆర్ఎస్ అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, నాయకులు మంజూర్, దయాకర్, మురళి గౌడ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు యూసుఫ్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed