- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X
దిశ, ఖానాపూర్: ఏసు క్రీస్తు బోధనలు ప్రజలను సన్మార్గంలో నడిపిస్తాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఖానాపూర్ శాంతి జ్యోతి ఒహెగా చర్చిలో మినీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చర్చి ప్రాంగణంలో కేక్ కట్ చేసి, ప్రభుత్వం తరపున క్రిస్టియన్లకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దైవధూత ఏసు క్రీస్తు ఆశీర్వాదంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు.
తెలంగాణలో అన్ని పండుగలు అన్ని వర్గాల ప్రజలు జరుపుకుంటున్నారని ఇదంతా సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న సమానత్వ విధానం వల్లనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మండలపార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నర్సయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీలు మర్రి కవిత, బోడ భారతి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story