భార్యను చంపిన కేసులో భర్త అరెస్ట్..

by Kalyani |   ( Updated:2025-03-15 17:55:12.0  )
భార్యను చంపిన కేసులో భర్త అరెస్ట్..
X

దిశ, సిద్దిపేట అర్బన్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపిన కేసులో భర్తను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. శనివారం సిద్దిపేట ఏసిపి ఆఫీస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీహార్ రాష్ట్రం తల్వార్ బంధ గ్రామానికి చెందిన బోలరాం హరిజన్ అదే రాష్ట్రానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ వివాహం చేసుకొని ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా బీహార్ రాష్ట్రం నుండి సిద్దిపేట కు తీసుకు వచ్చాడు. దక్కల కాలనీలో మేర సంఘం భవనం సమీపంలో ఒక రూమ్ కిరాయికి తీసుకొని అందులో కాపురం పెట్టి, పెయింటర్ గా పనిచేస్తూ ఉండేవాడు.

కాగా అతనికి మద్యంతో పాటు ఇతర చెడు అలవాట్లు ఉండడంతో, రోజు తాగి వచ్చి ప్రతినిత్యం భార్యని కొట్టేవాడని, ఈ క్రమంలో ఎప్పటిలాగే ఫిబ్రవరి 14వ తేదీ రాత్రి బాగా తాగి వచ్చి తన భార్యతో రోజులాగే గొడవ పడి కోపంలో ఆమె తలను గోడకేసి గుద్ది, గొంతు పిసికి చంపి, శవాన్ని ఎమీ చేయాలో తెలియక అక్కడే ఉన్న మేర సంఘం భవనం సంపులో పడేసి మూత పెట్టి, సిద్దిపేట నుంచి బీహార్ రాష్ట్రానికి పారిపోయాడని ఏసీపీ తెలిపారు. మేర సంఘం అధ్యక్షుడు గంగాపురం కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కోసం గాలిస్తుండగా, శనివారం హరిజన్ సిద్దిపేట రూమ్ లో ఉన్న తన సామాన్లు తీసుకు వెళ్లేందుకు సిద్దిపేటకు రాగా సిద్దిపేట టూ టౌన్ సీఐ బి.ఉపేందర్, ఏఎస్ఐ యాసిన్ మియా, సిబ్బంది యాదగిరి, సుధాకర్ రెడ్డి, కనకరాజు, ప్రశాంత్ లతో కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా తన భార్యను చంపిన నేరాన్ని ఒప్పుకోవడంతో అతన్ని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.

Read Also..

భూవివాదం దాడిలో ముగ్గురిపై కేసు నమోదు

మద్యం మత్తు ప్రాణం తీసింది..

Next Story