DSP: వరుణ్ తేజ్ సినిమాపై డీఎస్‌పీ షాకింగ్ కామెంట్స్.. అందుకే నో చెప్పా అంటూ

by sudharani |   ( Updated:2025-03-15 18:12:18.0  )
DSP: వరుణ్ తేజ్ సినిమాపై డీఎస్‌పీ షాకింగ్ కామెంట్స్.. అందుకే నో చెప్పా అంటూ
X

దిశ, సినిమా: సౌత్‌లో స్టార్ మ్యూజిక్ కంపోజర్స్‌లో ఒకరిగా దూసుకుపోతున్నాడు దేవీశ్రీ ప్రసాద్ (DSP). తన సంగీతంతో ఎంతో మందిని మంత్ర ముగ్దులను చేస్తున్న ఈయన.. ప్రజెంట్ పాన్ ఇండియా (Pan India) సినిమాలకు మ్యూజిక్ (Music) అందిస్తూ స్పెషల్ క్రేజ్‌ (Special Craze)ను సొంతం చేసుకుంటున్నాడు. అంతే కాకుండా.. ఎలాంటి జోనర్ సినిమాలైనా తనదైన శైలీతో మ్యూజిక్ లవర్స్‌ను అలరిస్తూ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నేషనల్ ఫిలిమ్ అవార్డు(National Film Award)ను కూడా అందుకున్నాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూ(Interview)లో పాల్గొన్న డీఎస్‌పీ వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన ‘గద్దలకొండ గణేష్’ (Gaddalakonda Ganesh) సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. రిమేక్ సాంగ్స్‌(Remake Songs)పై మీ అభిప్రాయం ఏంటని యాంకర్ ప్రశ్నించగా.. ‘నేను ఓల్డ్ సాంగ్స్‌ను రీమేక్ చెయ్యను. అది నా సూత్రం. ‘గద్దలకొండ గణేష్’ సినిమా నేనే చెయ్యాలి. కానీ ఆ మూవీలో రీమేక్ సాంగ్ ఉంది. అందుకే నేను చెయ్యలేను సారీ అని చెప్పేశా’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ డీఎస్‌పీ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు కూడా చెప్పు అయ్యా కొంచెం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Read More..

Boney Kapoor: ‘హోలీ చాలా సంతోషంగా గడిచింది’.. అంటూ శ్రీదేవి ఫొటో పంచుకున్న బోనీ కపూర్

Next Story

Most Viewed