భూవివాదం దాడిలో ముగ్గురిపై కేసు నమోదు

by Sridhar Babu |   ( Updated:2025-03-15 18:06:20.0  )
భూవివాదం దాడిలో ముగ్గురిపై కేసు నమోదు
X

దిశ, రామడుగు : రామడుగు మండలం అన్నారం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బి.శేఖర్ తెలిపారు. ఎస్సై అందించిన వివరాల మేరకు రామడుగు మండలం వన్నారం గ్రామానికి చెందిన గాజుల శ్రీనివాస్ భూమితో పాటు తోవ విషయంలో శుక్రవారం అదే గ్రామానికి చెందిన వారాల నారాయణ, పరాల శ్రీనివాస్, వరాల స్వప్న, వరాల రవళి కలిసి గాజుల శ్రీనివాస్​ను బూతులు తిడుతూ బండరాళ్లతో దాడి చేశారు. దాంతో తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి.శేఖర్ తెలిపారు.

Read Also..

Vadodara: మద్యం మత్తులో లేను.. రోడ్డు పైనే గుంత.. వడోదరా యాక్సిడెంట్ పై నిందితుడి వ్యాఖ్యలు

Next Story