- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్పష్టమైన జాబితా రూపకల్పనకు రాజకీయ నేతలు సహకరించాలి

దిశ, మంచిర్యాల : జిల్లాలో స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ సమీకృత జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్తో కలిసి మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ ఈఆర్ఓలు శ్రీనివాస్ రావు, హరికృష్ణ, డి.చంద్రకళ, ఎన్నికల విభాగం అధికారి కె.వై. ప్రసాద్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2025లో భాగంగా ఓటరు జాబితా సంబంధిత దరఖాస్తు ఫారాలు 6, 7, 8 ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు.
నూతన ఓటరు నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులపై వచ్చే దరఖాస్తులను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పరిష్కరించడంపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో 271, బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో 419, మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో 596 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. 2, 3 రోజుల్లోగా దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్ల వివరాలు అందించాలని తెలిపారు.
ఓటరు జాబితాలో మృతి చెందిన వారి వివరాలను బూత్ స్థాయి అధికారి, రాజకీయ పార్టీలచే నియమించిన బూత్ స్థాయి ఏజెంట్లు సమన్వయంతో పని చేసి ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి తొలగించడంతో పాటు 2, 3 ఎపిక్ కార్డులు కలిగిన వారి వివరాలను పరిశీలించి తొలగించాలని తెలిపారు. ఒక కుటుంబానికి చెందిన అర్హత గల ఓటర్లు అందరూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మినిట్స్ ఆఫ్ మీటింగ్ సంబంధిత వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వివరాలు ఈ-మెయిల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read More..