గురుకుల వసతి గృహంలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

by Kalyani |   ( Updated:2025-03-15 17:56:45.0  )
గురుకుల వసతి గృహంలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
X

దిశ, దుబ్బాక : ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన దుబ్బాక మండలం హబ్షీపూర్ గ్రామ పరిధిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకులంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామానికి చెందిన బోయిని స్వప్న, స్వామి కుమారుడు అఖిల్ దుబ్బాక మండలం హబ్షీపూర్ గ్రామ పరిధిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకులంలో ఏడవ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు హైదరాబాద్ లో కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. హస్టల్ విద్యార్థులతో కలివిడిగా ఉండే అఖిల్ శనివారం తెల్లవారుజామున బాత్ రూమ్ లో కిటికీ ఊచలకు ఉరేసుకుని వేలాడుతున్నాడు. వేలాడుతున్న అఖిల్ను తోటి విద్యార్థులు చూసి అక్కడే ఉన్న వాచ్ మెన్ కిషన్ కు చెప్పారు.

వేలాడుతున్న అఖిల్ను కిందకు దించి సీపీఆర్ నిర్వహించి దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్న అఖిల్ కు ఫిట్స్ వచ్చాయి. అక్కడి నుంచి హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థి మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మెదక్ ఆర్సీఓ గౌతమ్ కుమార్ రెడ్డి పాఠశాలను సందర్శించి సంఘటనకు సంబంధించిన వివరాల పై ఆరా తీశారు.

Read Also..

బోయినపల్లిలో పాఠశాల బస్సు బోల్తా

సైబర్ నేరగాళ్ల వలలో సీనియర్ ఉద్యోగి

Next Story

Most Viewed