- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Samantha: కథకు ‘శుభం’ కార్డ్.. త్వరలోనే అందరికీ తెలుస్తుందంటూ సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. సామ్ సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ (Tralala Moving Pictures) ఆధ్వర్యంలో తొలి ప్రాజెక్ట్ ‘శుభం’ (Shubham) చిత్రీకరణ విజయవంతంగా పూర్తైంది. కామెడీ ఎంటర్‌టైన్మెంట్(Comedy Entertainment)తో పాటు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్(Thrilling experience) ఇచ్చేలా ఈ చిత్రం ఉండనుందని సమాచారం. ఇక త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. వసంత్ మరిగంటి రాసిన ఈ కథను ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula) తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజాకార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘ట్రాలాలా బ్యానర్ మీద ఈ సినిమాను మొదటి ప్రాజెక్ట్‌గా ఎందుకు ఎంచుకున్నామో త్వరలోనే అందరికీ తెలుస్తుంది’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ‘శుభం’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా మృదుల్ సుజిత్ సేన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా రామ్ చరణ్ తేజ్, ఎడిటర్‌గా ధర్మేంద్ర కాకర్లాడ్ పని చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే రానున్నాయి.
Read More..
Boney Kapoor: ‘హోలీ చాలా సంతోషంగా గడిచింది’.. అంటూ శ్రీదేవి ఫొటో పంచుకున్న బోనీ కపూర్