KTR: ఈ పాపం ఊరికే పోదు..

by Gantepaka Srikanth |   ( Updated:15 March 2025 6:24 PM  )
KTR: ఈ పాపం ఊరికే పోదు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసమర్థ సీఎం పాలనలో రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అంపశయ్యపై ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో ఆరోపించారు. కనీసం జ్వరం గోలీలు ఇచ్చే దిక్కు లేకుండా పోయిందని, అలాంటప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు నడపడం ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడొచ్చినా.. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు.. అని నిరుపేదలు విషాదగీతం పాడుకునే దుస్థితి ఉంటుందని ఆరోపించారు. డయాగ్నస్టిక్ సెంటర్ల నుంచి డయాలసిస్ కేంద్రాల దాకా కేసీఆర్ నిర్మించిన వైద్యారోగ్య వ్యవస్థ నిర్వీర్యమవుతున్నదని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల బతుకులను గాలిలో దీపంలా మార్చేశారని ఆరోపించారు. ఈ పాపం ఊరికే పోదని, రోగుల శాపం తగలక మానదని హెచ్చరించారు.

READ MORE ...

BRS ఎమ్మెల్యే కీలక ప్రకటన


Next Story

Most Viewed