- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ సేవలు మరువలేనివి.. ఎమ్మెల్యే విఠల్ ప్రశంసలు
దిశ, ముధోల్ : భైంసా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్య సిబ్బంది సేవలు మరువలేనివని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఈ తరుణంలో ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, స్టాఫ్.. ప్రజలకు చక్కని సేవలు అందిస్తున్నారని అన్నారు.
జిల్లాలోనే మొదటగా కొవిడ్ బాధితులకు ప్రసవాలు చేసిన ఘనత బైంసా ఏరియా ఆస్పత్రికి దక్కిందని, అలాగే ఇటీవల ఒక కుటుంబంలో అందరికీ కొవిడ్ సోకగా.. తల్లి.. తన బిడ్డకు పాలు ఇవ్వలేని పరిస్థితిలో 10 రోజుల పాటు బైంసా ఆస్పత్రికి చెందిన నర్సు.. తన చను పాలు పట్టి బిడ్డను కాపాడటం అభినందనీయమని అన్నారు. ఇలా ఆస్పత్రిలో పలు విధులు నిర్వహిస్తున్న డాక్టర్స్, నర్సులు, స్టాఫ్ సేవలకు గాను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వారి సన్మానించారు.
ప్రజలకు సేవ చేయడంలో ఇలానే ముందుండాలని కోరారు. ఆస్పత్రిలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని.. కావున ప్రజలు వైద్య సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.