- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఢిల్లీలో దోస్తానా చేస్తూ గల్లీలో కుస్తీ పడుతూ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అని అన్నారు. 2014 మేనిఫెస్టోలో ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ, ఇంటికో ఉద్యోగం అని టీఆర్ఎస్ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశాయన్నారు. మహబూబాబాద్‌కు చెందిన సునీల్ నాయక్ ఆత్మహత్య ప్రభుత్వం చేసిన హత్యేనని ఆయన ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లేకుండా పోయాయని ఈ కారణంగానే యువత నిరుత్సాహానికి లోనవుతున్నారని చెప్పారు. వెంటనే రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టత ఇవ్వాలన్నారు. మంథనిలో పర్యటించిన సంజయ్ రైతులకు నష్టం కల్గించే విధంగా తీసుకొచ్చిన చట్టాల గురించి ఊసే ఎత్త లేదని విమర్శించారు.