మేము పాకిస్తాన్ నుంచి వచ్చామా : సీతక్క

by Aamani |
మేము పాకిస్తాన్ నుంచి వచ్చామా : సీతక్క
X

దిశ, ఆదిలాబాద్: ఆదివాసీలకు సేవ చేస్తే అడ్డుకోవడం ఏమిటి..? మేము పాకిస్తాన్ నుంచి వచ్చామా..? లేదంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చామా..? అని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అటవీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలు, గిరిజనులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకోవడంపై ఆమె మండిపడ్డారు. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో అడవిలో నివసించే ఆదివాసీలకు నిత్యావసర సరుకులు అందజేస్తుంటే ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై ఆమె మండిపడ్డారు. గురువారం సాయంత్రం కొమరంభీమ్ ఆసీఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ టీ మండలంలో పలు ఆదివాసీగుడాలకు వెళ్లి ఆమె నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed