క్రిస్మస్ ఫెస్టివల్‌పై ఎమ్మెల్యే రేగా కాంతారావు కీలక వ్యాఖ్యలు

by Sridhar Babu |
క్రిస్మస్ ఫెస్టివల్‌పై ఎమ్మెల్యే రేగా కాంతారావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, మణుగూరు: మనుషులు చేసిన పాపాలకై సిలువలో వ్రేలాడిన యేసుక్రీస్తు ఎంతో గొప్ప దైవ సంభూతుడని, ఎక్కడైతే ముగ్గురు మనుషులు గుమ్ముకుడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పిన క్రీస్తు మాటలు మారువలేనివని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వవిప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మనుషులు చేసిన పాపాలను యేసుప్రభు సిలువ ద్వారా తన భుజానికి ఎత్తుకోని సిలువలో వ్రేలాడారన్నారు. కావున మనమంతా కూడా యేసుక్రీస్తు మార్గంలోనే నడవాలన్నారు.

ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఎంతో ఘనంగా జరుపుకుంటారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే క్రైస్తవులందరు కరోనా నియమ నిబంధనలు పాటించి పండుగను జరుపుకోవలన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. ఒమిక్రాన్ రూపం ద్వారా కరోనా కేసులు ఎక్కువగా నమోదవ్వుతున్నందున జాగ్రత్తలు పాటించి పండగను ఆనందంగా జరుపుకోవాలన్నారు.

Advertisement

Next Story