కడియం వ్యాఖ్యలకు రాజయ్య కౌంటర్

by Shyam |
కడియం వ్యాఖ్యలకు రాజయ్య కౌంటర్
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేనే బాస్‌… ఇంకెవ్వరూ కాదని స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌ ఎమ్మెల్యే రాజ‌య్య మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే రాజ‌య్యను ఉద్దేశించి శ‌నివారం రాత్రి ఓ కార్యక్రమంలో కడియం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ‘నెత్తిమీద ప‌ది రూపాయ‌లు పెడితే కూడా అమ్ముడుపోని వాళ్లు నాపై నింద‌లు వేయాల‌ని చూస్తున్నారు’ అంటూ ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించి విమర్శించారు. క‌డియం వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీలో సంచ‌ల‌నంగా మారాయి. ఆదివారం సాయంత్రం స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌లో జ‌రిగిన ఎమ్మెల్సీ విజయోత్సవ సంబరాల కార్యక్రమంలో రాజయ్య స్పందించారు. ‘నాకు ఎవ‌రూ కాదు ఇక్కడ బాస్‌. ఎస్.. నాకు టీఆర్ఎస్ అధిష్ఠాన‌మే, కేసీఆరే బాస్’ అంటూ క‌డియంను ఉద్దేశించి పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అనంత‌రం నేరుగా సీఎంను క‌లిసేందుకు హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరివెళ్లారు.

Advertisement

Next Story