మెదక్‌లో కరోనా టెస్టింగ్ సెంటర్

by vinod kumar |
మెదక్‌లో కరోనా టెస్టింగ్ సెంటర్
X

దిశ, మెదక్: పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ -19 టెస్టింగ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకోవడానికి గాంధీ ఆసుపత్రికి వెళ్లి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మెదక్ పట్టణంలోనే టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఎవరికైనా కరోనా ఉన్నట్లు అనుమానం వచ్చినట్లయితే వైద్య సిబ్బంది వారి ఇంటి వద్దకే వచ్చి నమూనాలు తీసుకెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ధర్మారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ టి.చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story