రాష్ట్రంలో చేనేతల ఆకలి చావులు మాయం : ఎమ్మెల్యే నోముల భగత్

by Shyam |
MLA Nomula Bhagath
X

దిశ, హాలియా: అందరూ చేనేత వస్త్రాలు ధరించి నేత కార్మికులను ఆదుకోవాలని ఎమ్మెల్యే నోముల భగత్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్యే భగత్ సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు ఉండేవని తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలు నిలిచి పోవడంతో పాటు చేనేత కార్మికులు ఆకలి చావులు లేకుండా పోయాయని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీ నాయకులు మొదలు సామాన్య ప్రజానీకం వరకు వారంలో ఒకరోజు తప్పక చేనేత వస్త్రాలు ధరించాలని కోరారు. మన చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ధరించడం వలన చేనేత కార్మికుల ఆత్మహత్యలు పూర్తిగా నిలిచిపోతాయని వెల్లడించారు. చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులు ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో మనందరిపై ఉందన్నారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన వస్త్ర వ్యాపారి నోముల భగత్ ఘనంగా సత్కరించారు.

Advertisement

Next Story

Most Viewed