- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నీళ్లు లేవ్.. కరెంట్ రాలె.. పట్టించుకోని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
దిశ, జనగామ: డబుల్ బెడ్‌రూం ఇళ్లల్లోకి వచ్చేటప్పుడు సకల సౌకర్యాలతో సహా చేరుకుంటామని, ఇక నీళ్లకు గోసపడుడు.. కరెంట్‌కు ఇబ్బంది పడుడు, ఇంటినెంబర్లకు ఆఫీసులు చుట్టూ తిరుగుడు ఉండదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఎన్నో వేదికల మీద చెప్పిన విషయం తెలిసిందే. అయితే వాస్తవంలో మాత్రం ముఖ్యమంత్రి ముచ్చట్లు ఉత్తదేనని తేలిపోతోంది. ఇందుకు జనగామ ప్రాంతంలోని ఏసీరెడ్డి నగర్ ( బాణాపురం) కాలనీవాసుల కష్టాలే నిదర్శనమని చెప్పాలి. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చేతుల మీదుగా ఇళ్లు పొందిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఇంటి నెంబరే గతిలేకపోవడం గమనార్హం. ఇంటి నెంబర్ లేకపోవడంతో విద్యుత్ మీటర్లు, కనెక్షన్లు కల్పించలేదు. నీటి వసతి కూడా లేదు. దీంతో బోరింగ్ నీరే దిక్కవుతోంది. తమ కష్టాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో నాలుగు రోజులుగా ఏసీరెడ్డి నగర్ వాసులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు.
చీకట్లోనే బతుకులు…పాములతో సహవాసం..
25 బ్లాకులు, 200 ఇండ్లను ఇటీవలే అధికారికంగా ప్రారంభించిన ఎమ్మెల్యే.. నూతన కలెక్టర్ కార్యాలయ నిర్మాణం కొరకు జిల్లా కేంద్రం సూర్యాపేట రోడ్డులోని ఏసీరెడ్డి నగర్ వాసుల స్థలాలను ఏసీరెడ్డి నగర్ వాసులకు ప్రభుత్వానికి అందించారు. ఈ క్రమంలో అప్పటి కలెక్టర్ శ్రీదేవసేనా ప్రభుత్వంతో మాట్లాడి గృహానిర్మాణా సంస్థ ద్వారా 10.60 కోట్ల నిధులతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయించి నిర్మాణంకు 2017లో శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్ అలస్యంతో 2021లో పనులు అసంపూర్తిగా ఉన్న ఏసీరెడ్డి నగర్ వాసులు కిరాయి ఇండ్లలో ఉండలేక ప్రభుత్వ తీరుపై నమ్మకం లేక పోరాటం చేపట్టి ఇండ్లను సొంత చేసుకున్నారు. ఇండ్లు సొంతం చేసుకున్న కొద్ది రోజుల్లోనే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గత నెల 10వ తేదిన ఇండ్లను అధికారికంగా ప్రారంభించి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీ ఇచ్చి నెల రోజులు గడుస్తున్నప్పటికి ఎటువంటి వసతులు కల్పన జరగలేదు. దీంతో కాలనీ వాసులు రిలే నిరహార దీక్షలను ప్రారంభించి ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నారు. త్రాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి సమస్యలు అధికంగా ఉన్నా వారిపై ప్రభుత్వం ఎటువంటి కనికరం చూపడం లేదని పలువురు సైతం ఆరోపణలు చేస్తున్నారు. ఇండ్లను అధికారికంగా ప్రారంభించినప్పటికి ఇంటి నెంబర్, విద్యుత్ మీటర్లు, నల్లా కనెక్షన్స్ మంజూరు కాకపోవడం, రాత్రులు విద్యుత్ లేకపోవడంతో పాములు, పుగురులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని ఏసీరెడ్డి నగర్ వాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.