వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి పాజిటివ్..

by srinivas |   ( Updated:2020-09-13 03:54:02.0  )
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి పాజిటివ్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.రోజురోజుకూ కేసుల సంఖ్య తొమ్మిది వేలు దాటుతుండటంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వారియర్లతో పాటు ప్రజాప్రతినిధులు కూడా వైరస్ బారిన పడుతున్నారు.

తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో వెంటనే ఆయన్ను అపోలో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే, కొన్ని రోజులుగా ఆయన నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. దీంతో తనకు ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారంతా టెస్టులు చేయించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

Read Also…

ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ జాబితా ప్రకటన..

Advertisement

Next Story

Most Viewed