- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఎవరి సత్తా ఏంటో.. అప్పుడు తేల్చుకుందాం’
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా పల్నాడులో రాజకీయ దుమారం రేగుతోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కోటలు దాటుతోంది. తాజాగా టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై ప్రస్తుత గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 25 వేల ఓట్ల మెజారిటీ సాధించామని.. వచ్చే ఎననికల్లో 40 వేల మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. యరపతినేని బాలకృష్ణ డైలాగులకు ఎవరూ భయపడరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికలకైనా.. స్థానిక సంస్థల ఎన్నికలకైనా మేము సిద్ధం అని సవాల్ విసిరారు. అంతేగాకుండా ఎవరి సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో తేల్చుకుందాం హెచ్చరించారు. తాము ఎవరిపై కేసులు పెట్టలేదని.. కోర్టు ఆదేశాల మేరకే వారు కేసులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటివరకూ జరిగిన దాడులు.. హత్యలకు పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. నిందితులపై కేసులు పెట్టి అరెస్టులు చేశారని సూచించారు. ప్రస్తుతం పల్నాడు ప్రశాంతంగా ఉందని, ఎలాంటి దాడులు జరుగడం లేదని ఎమ్మెల్యే కాసు మహేశ్ అన్నారు.