- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరవింద్ ఫేక్ ఎంపీ.. జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్
దిశ, తెలంగాణ బ్యూరో: ఎంపీ అరవింద్ కు దమ్ముంటే ప్రధాని మోడీతో మాట్లాడి పసుపు బోర్డు తేవాలని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫేక్ అరవింద్ ఫేక్ ఎడ్యుకేషన్ ఫేక్ బాండ్ పేపర్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ అంటేనే బిగ్ జోకర్ పార్టీ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేయని పనులు నిలదీయాలి తప్ప.. వ్యక్తిగతంగా మాట్లాడడం మానుకోవాలని బీజేపీ నేతలకు సూచించారు. అవినీతి గురించి బీజేపీ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. జీఎస్టీ కింద కేంద్రం ఇంకా రూ.30 వేల కోట్లు తెలంగాణకు బాకీ ఉందని స్పష్టం చేశారు.
కేసీఆర్ సీఎం అనే గౌరవం లేకుండా మాట్లాడటం వారి నైతికతకు వదిలి వేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని గుజరాత్ ముఠాతో నింపిన మోడీ పార్టీలో ఉంటూ అరవింద్ తెలంగాణాలో సామాజిక న్యాయం గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్ దేశంలోనే అత్యుత్తమ పాలకుడని అనేక ప్రశంసలు వస్తున్నాయని.. అరవింద్ తాటాకు చప్పుళ్ళకు ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఎన్ని పాదయాత్రలు చేసినా.. మోకాళ్ళమీద నడిచినా.. తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందన్నారు. బీజేపీ నేతలు మాటిమాటికి కేసీఆర్ ను జైలుకు పంపుతామని ప్రగల్బాలు పలుకుతున్నారని, పనికిమాలిన మాటలు మానుకొని తెలంగాణ ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని సూచించారు.